తెలంగాణ: సెక్రటేరియట్‌లో రెండు మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన
- November 25, 2021
హైదరాబాద్: తెలంగాణ నూతన సెక్రటేరియట్‌లో రెండు మసీదుల నిర్మాణానికి గురువారం నాడు శంకుస్థాపన జరిగింది.హైదరాబాద్ లోని నిజామియా యునివర్సిటీ వైస్ –చాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ శంకుస్థాపన చేయగా,రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహ్మూద్ అలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.జామియా నిజామియా షేక్ జామియా, ముఫ్తీ గియాస్‌లతో పాటు శాసన సబ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ,అహ్మద్ పాషా ఖాద్రి ,దానం నాగేందర్ ,ఎంఎల్ సి ఫరూక్ హుస్సేన్ లు పాల్గొన్నారు .ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు సచివాలయంలోని రెండు మసీదులకు శంకుస్థాపన జరిగిందని,అద్భుతమైన శైలిలో మసీదులు నిర్మిస్తామన్నారు.
ఇదివరకే రుపొందించబడిన టర్కీ మసీదుల నమూనాల ప్రకారం మసీదులను నిర్మిస్తామని హోం మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ అన్ని వసతులతో మసీదులు నిర్మిస్తామని కేసీఆర్ ముస్లింలకు హామీ ఇచ్చారని, ఆ మేరకే ఈ రోజు శంకుస్థాపన జరిగిందని మంత్రి తెలిపారు. ఇదివరకు పాత సచివాలయంలో మసీదులు 700 గజాల విస్తీర్ణంలో ఉండేవని, అయితే పెద్ద సంఖ్యలో ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా రెండు మసీదులకు కేసీఆర్ 1500 గజాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. పెద్ద మసీదులో ఇమామ్‌కు ఇల్లు కూడా నిర్మిస్తున్నామని, ఆయన అక్కడే ఉండి సమయానికి ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉందని మంత్రి తెలిపారు. నిర్మించబోయే పెద్ద మసీదులో మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయన్నారు.
మసీదుల నిర్మాణానికి మొత్తం రూ. 2.9 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కేసీఆర్ లౌకికవాది అని, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు.ప్రజల సౌకర్యార్థం ఐదురోజుల నమాజులు, శుక్రవారం నమాజులు, తరావీహ్, ఈద్ ప్రార్థనలు మసీదుల్లో చేసేలా నిర్మాణం ఉంటుందన్నారు.తెలంగాణ సచివాలయంలోని రెండు మసీదులకు దేశంలోనే విశిష్టమైన, ఆదర్శవంతమైన స్థానం ఉంటుందని మంత్రి అన్నారు.ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ సెక్రటేరియట్‌లోనూ ఇలాంటి మసీదులు లేవు అని హోం మంత్రి తెలిపారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ ముహమ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







