రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.3 కోట్ల 7 లక్షల విలువైన గంజాయి పట్టివేత..
- November 26, 2021
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మూడు కమిషనరేట్ పరిధిలో తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా ఎస్పీలు, కమిషనర్లు గంజాయి స్మగ్లింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 కోట్ల 7లక్షల రూపాయలు విలువైన గంజాయిని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు.
గంజాయి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. రాచకొండ సిపి మహేష్ భగవత్.. పక్క సమాచారం తో అబ్దుల్లాపూర్ మెట్టు స్టేషన్ పరిధిలో 3 కోట్ల 7లక్షల విలువైన గంజాయి తరలిస్తున్న ముఠా ను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారని సీపీ తెలిపారు. విశాఖ పట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోని సీలేరు నుండి మహారాష్ట్ర కు 1820 కేజీల గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. దీని విలువ సుమారు 3 కోట్ల 7 లక్షల 90వేలు ఉంటుందని తెలిపారు. ప్రధాన నిందితుడు సంజయ్ లక్ష్మణ్ షిండే సంవత్సరం నుండి ఈ దందా చేస్తున్నాడని, మొత్తం ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీపీ మహేష్ భగవత్ అన్నారు.
టెన్ టైర్ లారీలో విశాఖ ఏజెన్సీ లోని సీలేరు ప్రాంతం నుండి గంజాయిని ముంబై మహారాష్ట్ర తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఐదుగురు నిందితులను రాచకొండ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ లక్ష్మణ్ షిండే జైల్ లో ఉన్నట్టు సమాచారం ఉందని, అరెస్టయిన నిందితుల వద్ద నుండి 3 కోట్ల 7 లక్షల 90 వేల విలువైన గంజాయిని, ఒక లారీ, కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తెలంగాణ రాష్ట్రంలో కి గంజాయ్, మాదకద్రవ్యాలు ఆంధ్ర ఒరిస్సా నుండి ఎక్కువగా వస్తున్నాయన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. 62 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారే పట్టుబడుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం 5 వేల కేజీల గంజాయి పట్టుకున్నామని, 31 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు.ఎన్‌డీపీఎస్ లాంటి కఠిన చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామనీ.. ఇలాంటి చట్టాల వల్ల మాదకద్రవ్యాల రవాణా నీ కొంత అరికట్ట గలమని అన్నారు.


తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







