ఏపీ అసెంబ్లీ ఘటనపై స్పందించిన నారా భువనేశ్వరి..!
- November 26, 2021
ఏపీ: నారా భువనేశ్వరి మౌనం వీడారు.ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు నారా భువనేశ్వరి స్పందించారు.ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో… ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు. చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంటారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలిఅని తెలిపారు. కష్టాల్లో ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి అని సూచించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను అని అందులో పేర్కొన్నారు నారా భువనేశ్వరి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!