భయపెడుతున్న ఓమిక్రాన్: ఆర్‌టీ-పీసీఆర్, క్వారంటైన్ తప్పనిసరి చేసిన కర్ణాటక

- November 27, 2021 , by Maagulf
భయపెడుతున్న ఓమిక్రాన్: ఆర్‌టీ-పీసీఆర్, క్వారంటైన్ తప్పనిసరి చేసిన కర్ణాటక

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయట పడ్డ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించే నగరాల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా ఎఫెక్టెడ్ దేశాల నుంచి బెంగళూరుకు వచ్చే వారికి ఆర్‌టీ-పీసీఆర్, క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖతో టచ్‌లో ఉన్నట్లు కర్ణాటక వైద్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. ఇప్పటివరకు సౌతాఫ్రికా, హాంగ్ కాంగ్, ఇజ్రాయెల్, బోట్సవానా దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసింది.

ఆ నాలుగు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పాజిటివ్‌గా తేలితే విమానశ్రయం పరిధిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ సోకినా సోకకున్నా కచ్చితంగా హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

గత ఆరు నెలల కాలంలోనే ఆరు జినోమిక్ ల్యాబోరేటరీలను ఏర్పాటు చేశారు. ఆ నాలుగు దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల శాంపిల్స్ సేకరించి, పరీక్షల కోసం పంపుతాం. దాని ద్వారా వైరస్ మ్యూటేషన్ పరిస్థిని అంచనా వేస్తాం అని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com