పలు దేశాల నుంచి విమానాల్ని రద్దు చేసిన ఒమన్

- November 27, 2021 , by Maagulf
పలు దేశాల నుంచి విమానాల్ని రద్దు చేసిన ఒమన్

మస్కట్: సౌత్ ఆఫ్రికా, నాంబియా, బోట్సువానా, జింబాబ్వే, లెసాతో, ఇస్వాంటిని మరియు మొజాంబిక్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై నవంబర్ 28 నుంచి నిషేధం విధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. కోవిడ్ 19 సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటలు అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైన పేర్కొన్న దేశాల్లో గత 14 రోజుల్లో పర్యటించి వుంటే, అలాంటివారిపైనా బ్యాన్ కొనసాగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com