మూడో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్ ఎంపిక
- March 22, 2016
దేశంలో అతిపెద్ద పార్క్ నిర్వాహక సంస్థ 'వండర్ లా' ఇప్పుడు నగరవాసులను అలరించనుంది. దేశంలోని తన మూడో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంది. ఈ మేరకు రూ. 250 కోట్ల ఖర్చుతో అద్భుతమైన పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే బెంగుళూరు, కొచ్చిల్లో పదేళ్లుగా ఆ సంస్థ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే పార్క్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 50 ఎకరాల స్థలంలో విస్తరించనుందని 'వండర్ లా హాలిడేస్ లిమిటెడ్' సంస్థ ఎం.డి. అరుణ్ తెలిపారు. హైదరాబాద్‌లో వండర్ లా అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించినప్పటి నుంచి నగరవాసుల నుంచి మంచి స్పందన లభించిందని, 15 నెలలుగా అత్యున్నత ప్రమాణాలతో చేపట్టిన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందన్నారు.ఏప్రిల్ 3వ వారంలో ప్రారంభిచనున్నామని ఆయన తెలిపారు. రెండేళ్ల క్రితం పార్క్ నిర్మాణం కోసం పబ్లిక్ ఇష్యూకి వెళ్లామని, అనుకున్న సమయానికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగామన్నారు. ప్రారంభం రోజే పదివేల మందికి ఆహ్లాదం పంచే సౌలభ్యం, 43 కొత్త ఆసక్తికరమైన ల్యాండ్, వాటర్ రైడ్స్ అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాదిలో మరో మూడు కొత్త ఆకర్షణలను జోడించనున్నామని అరుణ్ వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







