భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- November 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 10,91,236 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 8,774 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కి చేరింది. నిన్న ఒక్క రోజే 543 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,68,554కి చేరింది.నిన్న 9,481 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,39,98,278కి చేరింది.
ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 543 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,05,691 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.34 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 82లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 121 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









