రాధేశ్యామ్ నుండి అప్‌డేట్.. లవ్ ఆంథెమ్ సాంగ్‌కు టైం ఫిక్స్
- November 28, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ పేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు జోరు పెంచింది. అభిమానుల కోరిక మేరకు ఇకపై గ్యాప్ లేకుండా వరుసగా అప్‌డేట్లు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసి అంచనాలు భారీగా పెంచిన మేకర్స్ రెండో సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది.
వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ లాంచ్‌కు ముందు దాని టీజర్ రేపు విడుదల కానుంది. 'రాధేశ్యామ్' లవ్ ఆంథెమ్ సెకండ్ సాంగ్ హిందీ టీజర్‌ని మధ్యాహ్నం 1 గంటలకు లాంచ్ చేయనుండగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పిస్తారు.
వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఊహించని విధంగా సినిమా ఉండబోతుందని, గతంలో ఎప్పుడూ చూడని విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









