అంతర్జాతీయ విమాన సర్వీసులకు బ్రేకులు పడేట్టే ఉంది...
- November 29, 2021
భారత్: కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి… అవసరాలను బట్టి కొన్ని ప్రత్యేక సర్వీసులను మాత్రమే తిప్పారు.. క్రమంగా కొన్ని రూట్లతో విమానసర్వీసులను నడుపూ వస్తున్నా.. అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందే లేదు.. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా సాధారణ పరిస్థితులు రావడంతో.. డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ నెల 26వ తేదీన కేంద్రం ప్రకటించింది.. కానీ, మళ్లీ ఇప్పుడు పునరాలోచనలో పడిపోయింది కేంద్రం.. దానికి కారణం.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… ఈ కొత్త వేరియంట్ పలు దేశాల్లో గుబులు పుట్టిస్తోంది.. గత వేరియంట్ల కంటే ఇది చాలా ప్రాణాంతకమని, వేగంగా వ్యాపిస్తుందని నివేదికలు హెచ్చరిస్తున్నారు.. ఈ తరుణంలో అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిపోయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడంపై సమీక్షించింది కేంద్రం… కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగిన హైలెవల్ మీటింగ్ నిర్వహించారు.. కోవిడ్ కొత్త వేరియంట్ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయాన్ని సమీక్షించింది.. అయితే, ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభించాలి అనే దానిపై మాత్రం ఓ నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. కాగా, కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చి 23 నుంచి దాదాపు 20 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవడంలేదు.. అయితే, 31 దేశాలతో బబుల్ ఒప్పందం మేరకు గత ఏడాది జులై నుంచి కొన్ని సర్వీసులు నడుపుతున్నారు.. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో నడపాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఒప్పుడు కొత్త వేరియంట్ కలవరంతో అది కూడా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







