ఇకపై సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా అనుమతి
- November 30, 2021
సౌదీ: సింగిల్ డోస్ COVID-19 వ్యాక్సిన్ వేసుకున్న అన్ని దేశాల నుండి వచ్చే ప్రయాణికులను అనుమతి ఇస్తామని సౌదీ అరేబియా వెల్లడించింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని అన్ని విమానయాన సంస్థలు కొత్త నిబంధనలను అమలు చేయాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 4 శనివారం ఉదయం 1:00 గంటల నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే సింగిల్ వ్యాక్సిన్ తీసుకొని వచ్చిన ప్యాసింజర్స్ సౌదీ అరేబియా వచ్చాకా తప్పనిసరిగా మూడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ పీరియడ్ అమలు చేయబడుతుందని సర్క్యులర్ లో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని కూడా విమానయాన సంస్థలకు సివిల్ ఏవియేషన్ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!







