సాల్మియాలో 30 వేల 'స్మార్ట్ మీటర్ల' ఇన్‌స్టాల్
- November 30, 2021
కువైట్: సాల్మియాలో ఇప్పటివరకు వాటర్, విద్యుత్ కలెక్షన్లకు 30,000 స్మార్ట్ మీటర్లను ఇన్ స్టాల్ చేసినట్లు విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది ఈ ప్రాంతంలో అవసరమైన మీటర్లలో దాదాపు సగం మీటర్లకు సమానం. గత రెండు నెలలుగా వాటర్, విద్యుత్ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చుతున్న విషయం తెలిసిందే. హవల్లిలో ఒక నెలలోపు ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. మీటర్లను ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియ వేగం పెరిగిందని, రోజుకు 1,000 మీటర్లను ఇన్ స్టాల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. స్మార్ట్ మీటర్లను ఇన్‌స్టాల్ చేసిన వారందరూ తమ పాత బకాయిలు చెల్లించారని అధికార వర్గాలు కోరాయి. కరోనా మహమ్మారి సమయం కంటే ఇప్పుడు బిల్లుల వసూళ్లు పెరిగాయని అధికారులూ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 370 మిలియన్ దినార్‌లను వసూలు చేయాలని మంత్రిత్వ శాఖ టార్గెట్ పెట్టగా.. ఇప్పటివరకు 300 మిలియన్ దినార్‌లను వసూలు చేసినట్ల అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







