ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- June 25, 2026
కువైట్: ప్రాంతీయ భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల మధ్య కూడా కువైట్ వినియోగదారులు భారీగా ఖర్చు పెడుతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత ఈ ఖర్చుల వేగంగా పుంజుకుని, మే 2026 నాటికి 4.76 బిలియన్ కువైట్ దినార్ల (KD) స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి-మే కాలంలో నమోదైన అత్యధిక స్థాయి ఇదే అని అధికారులు తెలిపారు.
కువైట్ సెంట్రల్ బ్యాంక్ గణాంకాల ప్రకారం..ఫిబ్రవరిలో 4.48 బిలియన్ KDగా ఉన్న వ్యయం మార్చిలో 4.6 బిలియన్ KDకి పెరిగింది. అయితే ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఏప్రిల్‌లో 4.37 బిలియన్ KDకి తగ్గింది. అయినప్పటికీ, మే నెలలో వ్యయం 398.6 మిలియన్ KD మేర భారీగా పెరిగింది. ఇది వినియోగదారుల విశ్వాసం తిరిగి పుంజుకోవడాన్ని మరియు ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాధారణ స్థితికి రావడాన్ని సూచిస్తుందన్నారు.
పాయింట్-ఆఫ్-సేల్ (POS) లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపులు, ఏటీఎంలు మరియు తక్షణ చెల్లింపు సేవ అయిన 'WAMD' ద్వారా జరిగిన బలమైన కార్యకలాపాల ఫలితంగా..2026 మొదటి ఐదు నెలల్లో మొత్తం వినియోగదారుల వ్యయం సుమారు 23.17 బిలియన్ KDకి చేరుకుంది. అదే సమయంలో బ్యాంకింగ్ కార్యకలాపాలలో కూడా వృద్ధి కనిపించింది. మే చివరి నాటికి మొత్తం రుణ సదుపాయాలు 1.16 బిలియన్ KD పెరిగి 64.9 బిలియన్ KDకి చేరగా, మొత్తం డిపాజిట్లు 4.6% పెరిగి 61.89 బిలియన్ KDకి చేరుకున్నాయి. ఇది కువైట్ ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక రంగంపై ఉన్న నిరంతర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







