దుబాయ్ ఎక్స్‌పో 2020: 150 దిర్హామ్ లకే ఫెస్టివ్ పాస్
- December 01, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్‌పో 2020 అద్భుతాలను మనసారా ఆస్వాదించేందుకు ఎక్స్ పో నిర్వహకులు 150 దిర్హాంలకే ఫెస్టివ్ పాస్ ఆఫర్ ను ప్రకటించారు. UAE ఇండిపెండెన్స్ డే రోజున మెగా ఈవెంట్ లోకి ఎంట్రీ ఫ్రీ కాగా.. వరల్డ్ ఫెయిర్ లోని అద్భుతాలను ఆనందించేందుకు ఆ ఒక్క రోజు సరిపోదు. అందుకే డిసెంబర్ 31 వరకు ఫెస్టివ్ పాస్ లను అమ్ముతున్నారు. సీజన్ పాస్ ను ఫెస్టివ్ పాస్ తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోలో UAE స్వర్ణోత్సవాన్ని డిసెంబర్ 1 నుండి 4 వరకు 'ది జర్నీ ఆఫ్ ది 50'తో సెలబ్రేట్ చేయనున్నారు. అలాగే అల్ వాస్ల్ ప్లాజా క్రిస్మస్ ట్రీ లైటింగ్, ఫెస్టివ్ ట్రైన్స్, మెరిసే స్ట్రీట్ లైట్స్, మిరుమిట్లు గొలిపే క్రాకరీ వెలుగులు, 3D ఒంటెలు, జెయింట్ స్నో గ్లోబ్స్, రెయిన్ డీర్ లను ఆనందించవచ్చు. వీటితో పాటుగా కరోల్ కచేరీలు, ఎగిరే పియానోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఈవెంట్ నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







