ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల కావడం లేదు..!
- December 01, 2021
హైదరాబాద్: జనవరి 7న మూవీ లవర్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అందుకే డిసెంబర్ 3న ట్రైలర్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులంతా దానికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ టీమ్ అభిమానులను నిరాశపరిచే న్యూస్ వారి ముందు పెట్టింది. చిన్న చిన్న సినిమాలు కూడా ప్రతీ అప్డేట్కు ఒక ఈవెంట్‌ను పెట్టి ప్రమోట్ చేస్తున్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం సైలెంట్‌గా ట్రైలర్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉందా అన్న అనుమానం ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలయింది. అలా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుందేమో అనుకున్నారంతా. ట్రైలర్ విడుదల తర్వాత ఈ ప్రశ్నకు ఒక సమాధానం దొరుకుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ట్రైలర్ డిసెంబర్ 3కు విడుదల కావడం లేదు.
అనుకోని సంఘటనలు ఎదురవడం వల్ల ఆర్ఆర్ఆర్ ట్రైలర్ డిసెంబర్ 3కు విడుదల కావడం లేదని మూవీ టీమ్ ట్వీట్ చేసింది. దీనికి ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా.. లెజెండరీ రైటరీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణానికి ఈ రకంగా నివాళులు అర్పించినందుకు ప్రశంసిస్తున్నారు కూడా. అయితే ట్రైలర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వకపోయినా కూడా త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







