భారత్ కరోనా అప్డేట్

- December 02, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి.అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గ‌డిచిన 24 గంట‌ల్లో భార‌త్‌లో కొత్తగా 9,765 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 99,763 కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భార‌త్‌లో క‌రోనాతో 477 మంది మృతి చెందారు.

ఇక గడిచిన 24 గంటల్లో 8,548 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,69,724 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,46,06,541 గా నమోదు అయింది. మరోవైపు భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,24,96,515 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com