ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోక పోయినా వాట్సాప్‌లో చాటింగ్ చేయొచ్చు..
- December 02, 2021
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న చాటింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్ ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లలో మార్పులు చేర్పులు చేస్తుండడమే వాట్సాప్ ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే కచ్చితంగా సదరు వ్యక్తి నెంబర్ మన ఫోన్‌లో ఉండాల్సిందే..ఈ విషయం మనందరికీ తెలిసిందే.
అయితే నెంబర్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్‌ను పంపించుకునే అవకాశం కూడా ఉందని మీలో ఎంత మందికి తెలుసు. అవును మీరు చదివింది నిజమే నెంబర్ సేవ్ చేసుకోకపోయినా వాట్సాప్‌లో మెసేజెస్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక కేవలం వాట్సాప్ వెబ్ ద్వారా వాట్సాప్ ఉపయోగించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
స్టెప్స్ ఇవే..
- ముందుగా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి.
- అనంతరం బ్రౌజర్‌లో https://wa.me/ అని టైప్ చేసి పక్కన మీరు ఎవరికైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో వారి నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఈ నెంబర్‌లో కంట్రీకోడ్‌ను కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత ఎంటర్ నొక్కాలి. అనంతరం Continue to Chat పైన క్లిక్ చేయాలి.
- వెంటనే Open WhatsApp అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే వాట్సాప్ డెస్క్‌టాప్ ఓపెన్ అవుతుంది.
- ఆ తర్వాత చాటింగ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







