53 దేశాల వారికి టూరిస్ట్ వీసాల జారీని కఠినతరం చేసిన కువైట్
- December 02, 2021
కువైట్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ శరవేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఇప్పటికే పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అటు గల్ఫ్ దేశాలు సైతం కొత్త వేరియంట్ ప్రభావం ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.అయినా ఒమైక్రాన్ ప్రవేశాన్ని నిలువరించలేకపోయాయి. తాజాగా సౌదీ అరేబియా, యూఏఈలోనూ తొలి కేసులు నమోదయ్యాయి. దీంతో గల్ఫ్‌లో కొత్త వేరియంట్ ప్రభావం మొదలైంది. ఈ నేపథ్యంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమైక్రాన్‌పై పోరులో భాగంగా పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసాల జారీని మరింత కఠినతరం చేసింది. ఒమైక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే పౌరులకు విజిట్ వీసాలను జారీ చేసే విషయమై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో 1,200 టూరిస్ట్ వీసాలు మంజూరు చేయగా, వీటిలో అత్యధికంగా 53 దేశాల పౌరులకు ఈ-వీసాల రూపంలో ఆన్‌లైన్ ద్వారా జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై ఈ 53 దేశాల వారికి టూరిస్ట్ వీసాలు అంతా ఈజీగా ఇవ్వబోమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







