'అఖండ' మూవీ రివ్యూ..

- December 02, 2021 , by Maagulf
\'అఖండ\' మూవీ రివ్యూ..

సినిమా -అఖండ

నటీనటులు -బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్, శ్రీకాంత్, పూర్ణ

దర్శకుడు -బోయపాటి శ్రీను

నిర్మాత -మిర్యాల రవీందర్ రెడ్డి

సంగీతం -తమన్

విడుదల -నేడే అఖండ

రివ్యూ: కరోనా సెకండ్ వేవ్ తర్వాత ధియేటర్లలో రిలీజైన పెద్ద సినిమా అఖండ. సింహా, లెజెండ్ వంటి మాస్ కమర్షియల్ హిట్స్ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందిన హాట్రిక్ మూవీ ఇది. టీజర్లు, ట్రైలర్ తో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్ లు సైతం భారీగా జరిగాయి. బాలయ్య కెరీర్లోనే అత్యధిక ధియేటర్లలో అఖండ చిత్రం ఇవాళే విడుదలైంది. మరి ఆడియన్స్ నుంచి అఖండకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ రివ్యూలో చూద్దాం. 

కథ: ఊరికి పెద్దగా, పేదవారికి అండగా ఉండే మురళీ కృష్ణ (బాలకృష్ణ) ఎవరికీ అన్యాయం జరిగినా సహించడు. పేదవారికోసం స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ కట్టించి సేవ చేస్తుంటాడు. ఈ క్రమంలో కలెక్టర్ గా ఆ ఊరికి శరణ్య (ప్రగ్యా జైశ్వాల్) వస్తుంది. మురళీ కృష్ణ మంచితనం, ఊరికోసం, ప్రజల కోసం ఆయన పడే తాపత్రయం చూసి అతడిపట్ల ఆకర్షితురాలవుతుంది. అలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్ళి చేసుకుంటారు. అదే ఊరిలో వరదరాజులు అనే వ్యక్తి అక్రమ మైనింగ్ జరుపుతుంటాడు. తను చేస్తున్న అక్రమాలకు అడ్డొస్తున్నవారిని హతమారుస్తుంటాడు. కాపర్ మైనింగ్‌తో ఆపకుండా యురేనియం తవ్వకాలు కూడా ప్రారంభించి ప్రకృతి వినాశనానికి కారణమవుతాడు. దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లుతుంది. ఈ పరిస్థితుల్లో మురళీకృష్ణ అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. తనను కేసులో ఇరికిస్తారు. అంతటితో ఆగకుండా మురళీకృష్ణ ఫ్యామిలీని కూడా చంపాలనే ప్రయత్నంలో...అఖండ ఎంట్రీ ఇచ్చి వారిని కాపాడుతాడు. అసలు అఖండ ఎవరు.? వరదరాజులను, అతని వెనుకున్న వారిని ఎలా అడ్డుకుంటాడు? మురళీకృష్ణ కుటుంబానికి అఖండకు సంబంధం ఏంటనేది మిగతా కథ.

కథనం: సినిమా ఫస్ట్ హాఫ్ లో మురళీకృష్ణ పాత్ర ఊరికి అండగా నిలబడటం....శరణ్యతో ప్రేమ, పెళ్ళి. ఓ నరహంతకుడు పీఠాధిపతిని చంపి ఆయన ప్లేస్ లో చేరి అక్రమ మైనింగ్ మాఫియాతో చేయించే అకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. మైనింగ్ మాఫియాకి ఎదురెళ్ళిన మురళీకృష్ణ కుటుంబాన్ని కాపాడటానికి ఇంటర్వెల్ ముందు అఖండ పాత్ర ఎంట్రీ ఉంటుంది. మురళీకృష్ణ, శరణ్యల కూతురు పాత్ర ద్వారా అఖండ పాత్రని తీసుకురావడం బాగుంటుంది. సినిమా అఖండ ఎంట్రీ వరకు ఒక ఎత్తు.. తర్వాత మరో ఎత్తు అనేలా సాగుతుంది. ప్రకృతి, చిన్నారులు, ముక్కంటి జోలికి వచ్చిన విలన్‌ని అఖండ అంతం చేయడం సెకండ్ హాఫ్.

హైలైట్స్: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో హాట్రిక్ మూవీ అంటే అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఏమేం ఎక్స్ పెక్ట్ చేస్తారో అవన్నీ అఖండలో ఉంటాయి. శివుడు అలియాస్ అఖండగానూ, మురళీకృష్ణ పాత్రలోనూ బాలకృష్ణ పర్ఫెక్ట్ గా చేశాడు. మరీ ముఖ్యంగా అఖండ పాత్రలోనైతే ఆయన రౌద్రం మాస్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. గెటప్ తో పాటు ఆహార్యం, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. హీరోల క్యారెక్టర్స్ ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకూ బాలయ్య మాస్ ఇమేజ్ ని ఎలివేట్ చేస్తూ చేసిన బోయపాటి టేకింగ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ లోనూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఎలివేషన్స్ ఇచ్చాడు బోయపాటి.

అఖండ ఎంట్రీ టైమ్‌లో వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ మొత్తం అఖండ క్యారెక్టర్ మీదే ఫోకస్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రతి ఫైట్ ఓ క్లైమాక్స్ లా ఉంటుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఊపు తెస్తోంది. అలాగే మురళీకృష్ణ పాత్రతో ప్రకృతి గురించి చెప్పించిన డైలాగ్స్...అఖండ పాత్రతో ధర్మం గురించి, దేవాలయాల గురించి చెప్పించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. పూర్ణ క్యారెక్టర్ కథకి చాలా ఇంపార్టెంట్. ఇక వరద రాజులుగా శ్రీకాంత్ లుక్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా అఖండ మాస్ ప్రేక్షకుల్ని ఎక్కువగా మెప్పించినా, ఫ్యామిలి ఆడియన్స్‌ని కూడా థియేటర్‌కి రప్పించే ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. మొత్తంగా బాలయ్య ఊర మాస్ జాతర 'అఖండ'.

--మాగల్ఫ్ రేటింగ్ 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com