‘నో పార్కింగ్’ వయోలేషన్స్ కట్టడికి స్మార్ట్ వెహికల్స్
- December 03, 2021
కువైట్:‘నో పార్కింగ్’ వయోలేషన్స్ కు పాల్పడే వాహనాలను గుర్తించేందుకు కొత్త టెక్నాలజీలతో కూడిన కొత్త స్మార్ట్ వెహికల్స్ ను కొనాలని జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ భావిస్తుంది. రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా లేటెస్ట్ టెక్నాలజీ కెమెరాలు అమర్చిన కార్లను ట్రాఫిక్ డిపార్టుమెంట్ ఉపయోగించింది.వీటి ద్వారా ప్రభుత్వ ఏజెన్సీ సెంటర్స్, కమర్షియల్ ప్లేసులు, మార్కెట్ల ముందు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించేలా, నిషేధిత ప్రదేశాల్లో నిలిపి ఉంచే వాహనాలను ప్రయోగాత్మకంగా గుర్తించే ట్రయల్స్ చేశారు. ఈ స్మార్ట్ వాహనాలు రోడ్లపై తిరుగుతూ వీడియో రికార్డింగ్ చేస్తూ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను గుర్తించి, వీడియో తీస్తాయి.ఆ తర్వాత ఆ వీడియో ఆధారంగా వాహన ఓనర్లకు నోటీసులు జారీ చేస్తారు. ట్రాఫిక్ అధికారులు మాన్యువల్‌గా నోటీసులు జారీ చేయవలసిన అవసరాన్ని ఇది నివారిస్తుంది. అప్పట్లో ఆ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఈ వాహనాలను కొనేందుకు డిపార్టుమెంట్ సిద్ధమవుతుంది.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







