డొమెస్టిక్ లేబర్ నిర్భంద కేంద్రం తొలగింపు.. క్వారంటైన్ సెంటర్ గా ‘ఖైతాన్’ స్కూల్
- December 05, 2021
కువైట్: కాంట్రవర్సీగా మారిన ఖైతన్ స్కూల్ వ్యవహారం మొత్తానికి కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం దాంట్లో కొనసాగుతున్న డొమెస్టిక్ లేబర్ నిర్బంధ కేంద్రాన్ని అధికారులు తొలగించారు. కొన్నాళ్ల పాటు దీన్ని క్వారంటైన్ సెంటర్ గా మార్చేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సిటీలో ఉన్న హోటలల్లో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఖైతాన్ స్కూల్ విషయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎలాంటి వివాదం లేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. స్కూల్లోని బ్లాక్ 4లో డొమెస్టిక్ లేబర్స్ ఇన్ స్టిట్యూషన్ ను రన్ చేస్తున్నారు. ఐతే దీన్ని క్వారంటైన్ సెంటర్ గా మార్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించటంతో వివాదం రేగింది. మొత్తానికి అధికారులు సంప్రదింపులు జరిపి అక్కడ ఉన్న స్థానికులను కన్విన్స్ చేసి ఖైతాన్ స్కూల్ క్వారంటైన్ సెంటర్ గా మార్చారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







