‘తీస్ మార్ ఖాన్’ షూటింగ్ పూర్తి!
- December 07, 2021
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాకు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తూ, నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించబోతున్నాడని, పాయల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాలకు భిన్నంగా ఉంటుందని దర్శకుడు కళ్యాణ్ తెలిపాడు. పాయల్ పాత్ర అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా అందరినీ ఆకట్టుకోనుందని అన్నారు. గోవాలో ఇటీవల ఆది సాయికుమార్, పాయల్ పై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ మూవీకి హైలెట్ గా నిలుస్తుందని, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెడుతున్నామని తెలిపారు. ఈ చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







