డిఫెన్స్ ఎస్టేట్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు..
- December 07, 2021
ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 97 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- మొత్తం 97 ఖాళీలకుగాను గ్రేడ్-2 సబ్ డివిజనల్ ఆఫీసర్ 89, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ 7, హిందీ టైపిస్ట్ 1 చొప్పున ఉన్నాయి.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. సబ్ డివిజనల్ ఆఫీసర్ పోస్టులకు పదో తరగతితోపాటు, సర్వేయింగ్‌లో డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. హిందీ టైపిస్ట్ పోస్టుకు పదో తరగతి పాసై నిమిషానికి 25 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు హిందీ లేదా ఇంగ్లిష్‌లో పీజీ చేసి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను ప్రిన్సిపల్ డైరెక్టర్, డిఫెన్స్ ఎస్టేట్స్, సధరన్ కామండ్, కోడ్వా రోడ్, పుణె – 411040 అడ్రస్‌కు పంపించాలి.
- అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చేయండి..
https://www.dgde.gov.in/
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు