ఫేక్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ కేసులో ఇద్దరికి జైలు

- March 23, 2016 , by Maagulf
ఫేక్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ కేసులో ఇద్దరికి జైలు

మలేసియాకి చెందిన ఇద్దరు మహిళలకు 'ఫ్రాడ్‌' కేసులో ఐదేళ్ళ జైలు శిక్షను విధించారు. ఖరీదైన వాచ్‌లను బహ్రెయిన్‌లో ఫేక్‌ క్రెడిట్‌ కార్డుల్ని ఉపయోగించి కొనుగోలు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, నిందితుల్ని అరెస్టు చేశారు. పక్కా ప్లాన్‌తో పోలీసులు అక్రమంగా క్రెడిట్‌ కార్డుల్ని వినియోగిస్తున్న మహిళల్ని ఆధారాలతో సహా పట్టుకున్నారు. మలేసియాలోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తున్న స్నేహితురాలి ద్వారా 12 ఫేక్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ని ఓ మహిళ పొందింది. ఇంకో మహిళ, తన కుటుంబం ద్వారా తనకు 14 క్రెడిట్‌ కార్డులు వచ్చినట్లు వెల్లడించింది. 7000 బహ్రెయిన్‌ దినార్స్‌ విలువైన వాచ్‌లను ఈ అక్రమ కార్డులతో కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. రూమ్‌ బుకింగ్‌ ఛార్జీలను కూడా క్రెడిట్‌ కార్డ్‌తోనే చెల్లించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com