మూడీ అంచనా: ఖతార్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ పెరగొచ్చు
- March 23, 2016
ఖతార్‌లో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ విద్యుత్ వినియోగదారులకు చార్జీల వడ్డన తప్పకపోవచ్చని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. ఈ పెంపు రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ కనెక్షన్స్‌కి 81 శాతం మరియు 40 శాతం వరకు ఉండచ్చునట. రెసిడెన్షియల్ 2.3 సెంట్స్, కమర్షియల్ 3 సెంట్స్ కిలోవాట్‌కి ఉండగా, దీని ఖర్చు 4.2 సెంట్స్ పెర్ కిలోవాట్స్‌గా ఉందని మూడీ రిపోర్ట్ చెబుతుంది. సబ్సిడీ రిఫార్మ్స్‌లో భాగంగా ఖతార్, అక్టోబర్‌లో ఇంపోజ్ చేసిన స్లాబ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్, నీరు అందుబాటులో ఉన్నాయి. ఖతార్ మరియు ఒమన్, సబ్సిడీల పరంగా చాలా ఎక్కువ మొత్తాల్ని వెచ్చిస్తున్నాయి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మిగతా దేశాలతో పోల్చితే. అంతర్జాతీయంగా చమురు ధరల సంక్షోభం తలెత్తడంతో, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సబ్సిడీల కోత ఒక్కటే మార్గంగా కన్పిస్తోంది. అదే జరిగినట్లయితే, సబ్సిడీల కోత ద్వారా ఎలక్ట్రిసిటీ టారిఫ్ వినియోగదారులకు భారం కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







