మహజూజ్ వీక్లీ డ్రా లో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- December 10, 2021
దుబాయ్: దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఓ భారతీయుడు జాక్పాట్ కొట్టాడు.ఈ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన అక్షయ్ ఎరియకడన్ అరవిందన్(22) అనే భారత యువకుడు ఏకంగా ఒక కేజీ బంగారం గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన అక్షయ్ ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అలా వచ్చిన సంపాదనతో స్వదేశంలో తనకు ఉన్న అప్పులు, కుటుంబ అవసరాలను తీరుస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితుల సూచన మేరకు ఇటీవల మహజూజ్ 54వ వీక్లీ డ్రాలో టికెట్ కొనుగోలు చేశారు. తాజాగా దుబాయ్‌లో మహజూజ్ లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో అక్షయ్ విజేతగా నిలిచారు. దీంతో మొదటి బహుమతిగా ఒక కిలో బంగారం గెలుచుకున్నారు.
ఇక ఇంత భారీ ప్రైజ్ గెలిచినందుకు అక్షయ్ ఆనందానికి అవధుల్లేవు.గత ఏడాది తన తండ్రి క్యాన్సర్‌తో చనిపోయారని, సరిగ్గా తన తండ్రి సంవత్సరికం రోజున మహజూజ్ డ్రా నిర్వహించడం, అందులో తాను కిలో బంగారం గెలుచుకోవడం నిజంగా నమ్మలేకపోతున్నానని అక్షయ్ చెప్పారు. ఇది తన తండ్రి తనకు దీవించి ఇచ్చిన బహుమతిగా ఆయన పేర్కొన్నారు. తన ఫ్యామిలీ అప్పులన్నీ తీర్చేయడమే తన కలగా చెప్పిన ఆయన.. ఈ భారీ ప్రైజ్‌తో అది సాకారం అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో కొంత మొత్తాన్ని వెచ్చించి ఓ ఇల్లు నిర్మించడంతో పాటు తన తల్లికి బంగారు చైన్ కూడా కొనుగోలు చేస్తానని అక్షయ్ తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







