నీ దేశమే నీ ఇల్లు

- December 10, 2021 , by Maagulf
నీ దేశమే నీ ఇల్లు

భరతమాత ముద్దు బిడ్డ 
భారతీయుల త్రివిధ దళాధిపతి
దేశంలోనే అత్యంత శక్తివంతమైన సైనికాధిపతి
దేశరక్షణే ధ్యేయంగా ఎనలేని నిబధ్ధతతో 
అహర్నిశలు అంకితభావంతో తమ ప్రాణాల కన్న 
ప్రజల ప్రాణాలే మిన్నగా నిరంతర సైనిక పోరాటంలో
అలుపెరగని యుధ్ధరంగంలో ఆరితేరిన వీరుడు
శత్రుసైనికులని ఎదురొడ్డి పోరాడిన అపరచాణక్యుడు
భారత రక్షణవ్యవస్థను పటిష్టం చేసిన శూరుడు 
ఎన్నో కీలకబాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ 
ఊహించని విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలని సైతం
లెక్కచేయకుండా విద్రోహక చర్యలని అరికడ్తు 
కులమతాలకు అతీతంగా మాతృభూమి రక్షణకై 
వెనుతిరగని రక్షకుడుగా చేస్తున్న మీ కృషి అమోఘం 
దేశసరిహద్దుల్లో ప్రహర కాస్తు గడ్డకట్టే చలిని సైతం
లెక్కచేయక నా ప్రతి రక్తపు బొట్టు నా దేశం కోసమే
అన్న యువసైనికుడు తెలుగుతేజం సాయితేజ్ 
నీ ధైర్యసాహసాలు త్యాగాలు ఆసేతు హిమాలయం
దివికెగసిన శాంతికాముకుడు సేవాతత్పరుడు
నా దేశం నా ఇల్లే అని చాటిచెప్పిన నీ సైనిక స్ఫూర్తి 
నీలగిరి కొండల్లో కొడిగట్టిన ఈ జవాన్ల జీవితాలు 
యావత్ మానవాళి వేనోళ్ళ కీర్తిస్తుంది జై జవాన్ 
ఏమిచ్చినా నీ ఋణం తీర్చుకోలేము ఓ సైనికా
అశ్రునయనాలతో ఓ వీరుడా నీకు ఇదే మా వందనం

 

--యామిని కొళ్లూరు(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com