24 నుంచి 26 వరకు అమరావతి నాటకోత్సవాలు
- March 23, 2016
గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆరాధన ఆర్ట్స్ అకాడమి, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో 24 నుంచి 26 వరకు అమరావతి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అకాడమి అధ్యక్షుడు డి.తిరుమల్లేశ్వరరావు తెలిపారు. బుధవారం బ్రాడీపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం ప్రముఖ రంగస్థల నటుడు కావూరి సత్యనారాయణ, సిరిగిరి సాంబశివరావులకు ఆరాధన అర్ట్స్ అకాడమి ఆత్మీయ పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం యువ కళావాహిని వారి బాపు చెప్పిన మాట, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ అశ్వద్ధామ నాటక ప్రదర్శనలు ఉంటాయన్నారు. 25న మన్నె శ్రీనివాసరావుకు గురజాడ గోపరాజు రమణకు బళ్లారి రాఘవ, నుసుమ కోటి శివకు సిఎస్ఆర్, నాయుడు గోపికి గరికపాటి రాజారావు, టి.బాలరాజుకు రఘురామయ్య, కె.రామకృష్ణ ప్రసాద్‌కు గోవిందరావు పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వివేకానంద నాటకం, పద్మశ్రీచే అన్నమయ్య సంకీర్తన గానం, క్రాంతిచే అమరావతి నృత్య రూపకం ఉంటాయన్నారు. 26న నాటకోత్సవాలు, అమరావతిలో శ్రీరామకృష్ణ హిందు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురు ప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ వారిచే స్వామి వివేకానంద నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. సమావేశంలో కావూరి సత్యనారాయణ, వైకే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







