BELలో ఉద్యోగాలు..
- December 12, 2021
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా కాంట్రాక్ట్ మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.ఎంపికైన అభ్యర్థులు మచిలీపట్నం (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్,మచిలీపట్నం) యూనిట్లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేవారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

విద్యార్హతల వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్): ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ లేదా టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్/ఎంటెక్ చేసిన అభ్యర్థులు ఈ విభాగంలోని ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్): మెకానికల్ విభాగంలో బీటెక్/ఎంటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్(Computer Science): కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీటెక్/ఎంటెక్ చేసిన వారు ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35 వేల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం Recruitment of Project Engineer - I – Machilipatnam Unit కేటగిరీ కనిపిస్తుంది. ఆ కేటగిరీలో Detailed advertisement – Click here, Application Form - Click here https://www.bel-india.in/Documentviews.aspx?fileName=01-DETAILED%20WEBSITE%20ADVT%20ENGLISH-08-12-2021.pdf తదితర ఆప్షన్లు కనిపిస్తాయి.
Step 3: అప్లికేషన్ ఫామ్ లో పేరు, చిరునామా, విద్యార్హతల వివరాలను నింపాలి.
Step 4: అప్లికేషన్ ఫామ్ కు విద్యార్హతల సర్టిఫికేట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ను జత చేయాల్సి ఉంటుంది.
Step 5: అప్లికేషన్ ఫామ్ ను Manager (HR) ,Bharat Electronics Limited, Ravindranath Tagore Road, Machilipatnam – 521001, Andhra Pradesh చిరునామాకు ఈ నెల 24లోగా పంపించాల్సి ఉంటుంది.
-- ఈ క్రింద అప్లికేషన్ ఫామ్ నింపడానికి ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదవడం మంచిది.



తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్‌లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









