వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన..
- December 13, 2021
వారణాసి: వారణాసిలో పర్యాటకాన్నిపెద్ద ఎత్తున అభివృద్ధికి ఉద్దేశించిన మెగా ప్రాజెక్ట్ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం వారణాసి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ, కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. కాలభైరవ దేవాలయంలో ప్రధాని మోడీ హారతి కార్యక్రమం నిర్వహించారు.కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌కు ప్రధాని మోడీ మార్చి 8, 2019న శంకుస్థాపన చేశారు. ఇది 5 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో విస్తరించిన ఆలయం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు 23 కొత్త భవనాలను నిర్మించారు.
కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపట్లో ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయ పనులు,గంగానదిని కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన మూడు వేల మంది సాధువులు, మతపెద్దలు, కళాకారులతో పాటు పురప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు BJP పాలిత రాష్ట్రాలకు చెందిన 12 మంది CMలు హాజరవుతారు. అంతకుముందు కాలభైరవ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గంగానదిలో డబుల్ డెక్కర్ షిప్‌పై ప్రయాణించారు. ఉత్తరప్రదేశ్ CM యోగి ఆదిత్యానాథ్ దాస్‌తో కలిసి ఆయన షిప్‌లో విహరించారు.వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, గంగా నదిలో పవిత్ర స్నానం అచరించారు. అనంతరం కాశీ విశ్వనాథ మెగా ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









