బూస్టర్ డోస్ తో ఒమిక్రాన్ కు చెక్
- December 16, 2021
యూఏఈ: అర్హులైన వారంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) కోరింది. బూస్టర్ డోస్ తో ఒమిక్రాన్ లాంటి వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చని తెలిపింది. NCEMA డాక్టర్ తాహెర్ అల్ అమిరి మాట్లాడుతూ.. బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా వైరస్ తో పోరాడటానికి అవసరమైన యాంటీ బాడీలు ప్రొడ్యూస్ అవుతాయన్నారు. బూస్టర్ డోస్ తీసుకున్న వారికి ఒమిక్రాన్ సోకే అవకాశం తక్కువని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) చేసిన అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడి, వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకొని ఆరు నెలల దాటితే బూస్టర్ షాట్లను తీసుకునేందుకు అర్హులన్నారు. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ (MGH), హార్వర్డ్, MIT పరిశోధనల ప్రకారం.. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అది ఒమిక్రాన్ ను సమర్థంగా అడ్డుకోలేదని, బూస్టర్ షాట్ తీసుకోవడం ద్వారానే ఒమిక్రాన్ ను అడ్డుకునే రక్షణ వ్యవస్థ రూపొందుతుందన్నారు. మోడర్నా లేదా ఫైజర్/బయోఎన్‌టెక్ రెండు డోసులు, జాన్సన్ అండ్ జాన్స్ సింగిల్ డోస్ తీసుకున్న వారిపై వారిపై రీసెర్చ్ చేయగా వారికి ఒమిక్రాన్ సోకే అవకాశం ఉన్నట్లు తేలిందని...బూస్టర్ డోస్ ద్వారానే దాన్నిఒమిక్రాన్ నుంచి రక్షణ పొందవచ్చని తేలిందని NCEMA డాక్టర్ తాహెర్ తెలిపారు. బూస్టర్ డోస్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్