భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- December 16, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం…గత 24 గంటల్లో కొత్తగా 7,974 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 343 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,18,602 కు చేరుకుంది.అలాగే మరణాల సంఖ్య 4,76,478 కు చేరుకుంది.ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,245 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.ఇక గత 24 గంటల్లో 7,948 మంది కోలుకున్నారు. అలాగే మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,35,25,36,986 మందికి పైగా వ్యాక్సిన్ వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
తాజా వార్తలు
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్







