సినిమా పరిశ్రమకు కార్మిక శాఖ కొత్త రూల్స్
- December 16, 2021
హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులలాగే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ను ప్రారంభించి తరువాత ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా నిలదొక్కుకున్న స్టార్స్ చాలామందే ఉన్నారు. అయితే కొన్నిసార్లు సినిమాలు లేదా సీరియల్స్ చేయడం వల్ల చైల్డ్ ఆర్టిస్టుల చదువుకు ఆటంకం కలుగుతుంది. పైగా వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారి సమస్యలపై దృష్టి పెట్టిన తెలంగాణ కార్మిక శాఖ తాజాగా సినిమా పరిశ్రమకు కొన్ని నిబంధనలు విధించింది.
14 సంవత్సరాల్లోపు పిల్లలు ఇకపై ఏ రంగాల్లో పని చేయకూడదు. సినిమాలో పని చేసే చైల్డ్ ఆర్టిస్టులకు కలెక్టర్ అనుమతి పత్రం తప్పనిసరి. సినిమా నిర్మాత, దర్శకుడు ఎవరైనా జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక ముందు సినిమాల్లో బాల కార్మికులు కన్పించాలంటే కలెక్టర్ల అనుమతి తప్పనిసరి. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది కార్మిక శాఖ. ఇది మాత్రమే కాకుండా సంబంధిత చైల్డ్ ఆర్టిస్ట్ నుండి అనుమతి కూడా తీసుకోవాలి. వారికి సంబంధించి 25% పేమెంట్ జాతీయ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ సినిమా నిర్మాత చేయాలి. చైల్డ్ ఆర్టిస్ట్ విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







