హైదరాబాద్‌లో ఒమిక్రాన్ టెన్షన్..
- December 16, 2021
హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్‌లో ఎంటరైంది.విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించడం..వారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి.కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు..ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్‌పై ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీ.. ఒమిక్రాన్‌తో ఉలిక్కిపడింది.అక్కడ విస్తృతంగా టెస్ట్‌లు చేస్తున్నారు.దీని కోసం 25 హెల్త్ టీమ్స్‌ను రంగంలోకి దించారు అధికారులు..700 ఇళ్లలో ఉన్న జనాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇప్పటి వరకు 136 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు పూర్తి చేశారు.. మరో 36 గంటల తర్వాత ఆ టెస్ట్‌లకు సంబంధించిన ఫలితాలు రానుండగా...ఆర్టీపీసీఆర్లో పాజిటివ్‌గా తేలితే.. సదరు వ్యక్తుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపనున్నారు.ఆ తర్వాతే..వారికి సోకింది కోవిడా..? లేదా ఒమిక్రాన్ వేరియంటా? అనేది తేలిపోనుంది.మొత్తంగా.. ఒమిక్రాన్ టెన్షన్ ఇప్పుడు టోలీచౌకీ వాసులను కలవరపెడుతోంది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







