తుఫాన్ బీభత్సానికి 375 మంది బలి
- December 20, 2021
ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్ దేశాన్ని రాయ్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 375కి చేరింది. ఇప్పటికే తుఫాన్ సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ తుఫాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ఫిలిప్పీన్స్‌లో అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 8 లక్షల మందిపై రాయ్ తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే చాలామంది బాధితులు నీరు, ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో భారీ వృక్షాలు విరిగిపడి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిలిప్పీన్స్ప్రెసిడెంట్రొడ్రిగో డుటెర్టే తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలను సందర్శించారు. తుఫాన్ బాధితులకు 2 బిలియన్ పెసోస్ (40 మిలియన్ డాలర్లు) సాయం ప్రకటించారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







