‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా
- December 21, 2021
'భీమ్లా నాయక్' విడుదల తేదీకి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుకున్నట్టుగానే ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా పడింది.
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న “భీమ్లా నాయక్” విడుదల వాయిదా అంటూ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసులో నుంచి తప్పుకుంది. సంక్రాంతి రేసులో మూడు బిగ్ సినిమాలు ఉండగా, అభిమానులకు నిరాశ కలిగిస్తూ ‘భీమ్లా నాయక్’ వెనక్కి తగ్గాడు.
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ నిర్మాతల రిక్వెస్ట్ మేరకు ‘భీమ్లా నాయక్’ ను వాయిదా వేశారట. ఆ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి, తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ఉద్దేశ్యంతో, టాలీవుడ్ లో మూడు పెద్ద సినిమాలను ఒకేసారి ప్రదర్శించేటంత స్క్రీన్స్ సంఖ్య కూడా లేదు కాబట్టి ‘భీమ్లా నాయక్’ను వాయిదా వేసుకోమని పవన్ తో పాటు సినిమా నిర్మాతను కోరినట్టు దిల్ రాజు ప్రకటించారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న, ‘రాధేశ్యామ్’ జనవరి 14న ముందుగా అనుకున్నట్టుగానే విడుదల కానున్నాయి. ఇక ‘భీమ్లా నాయక్’ను మాత్రం జనవరి 12 నుంచి ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు, పవన్ కళ్యాణ్ కు, ప్రొడ్యూసర్ గిల్డ్ నుండి ధన్యవాదాలు’ అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇక పవన్ అభిమానులు కూడా విషయాన్ని అర్థం చేసుకుంటారని భావించారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..







