ఎంతో ఇష్టపడి కొనుక్కున్న టెస్లా కారును డైనమైట్ పెట్టి పేల్చేశాడు..!
- December 21, 2021
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఎంతో గిరాకీ ఉంది. విద్యుత్‌తో నడిచే ఈ కార్లను కొనుగోలు చేసేందుకు ఎంతో మంది క్యూ కడుతున్నారు. ఎన్నో మంచి ఫీచర్లను కలిగి ఉన్న టెస్లా కార్లు ఇటీవలి కాలంలో సాంకేతిక సమస్యలతో వినియోగదారులను విసిగిస్తున్నాయి.
హఠాత్తుగా రోడ్ల మీద ఆగిపోతూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అలా విసిగిపోయిన ఓ వ్యక్తి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారును పేల్చేశాడు.
ఫిన్లాండ్లోని కైమెన్‌లాక్సోకి చెందిన కటైనెన్ అనే వ్యక్తి ఇటీవల ఎంతో ఇష్టపడి టెస్లా కారును సొంతం చేసుకున్నాడు. 1500 కిలోమీటర్ల వరకు కారు చాలా అద్భుతంగా ప్రయాణించింది. ఆ తరువాత మొరాయించింది. ఆటోమేషన్ సిస్టమ్ ఎర్రర్ కారణంగా ఆగిపోయింది. దీంతో కటైనెన్ తన కారును టెస్లా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అయితే వారు కారు సర్వీసింగ్ ఖర్చుల కింద 20 వేల యూరోలు (రూ.17 లక్షలు) అడిగారు. అంత మొత్తం ఖర్చు పెట్టి బాగు చేయించడం ఇష్టం లేకపోవడంతో ఆ కారును పేల్చెయ్యాలని కటైనెన్ భావించాడు.
ఆ కారును జనావాస ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్న జాలా అనే మంచు ప్రాంతానికి తీసుకెళ్లాడు. కారుకు 30 డైనమైట్ స్టిక్స్ అమర్చి పేల్చేశాడు. కారును పేల్చేస్తున్నట్టు ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులకు చెప్పాడు. దాంతో వారు అక్కడకు చేరుకుని ఆ ఘటనను వీడియో తీశారు. కోటి రూపాయలకు పైగానే విలువ కలిగిన ఆ కారును పేల్చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







