‘సాహో’ తోనే సిగ్గు పోయింది అనుకున్నాను:ప్రభాస్
- December 24, 2021
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. పాన్ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ చిత్రంగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్ మాట్లాడుతూ” ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నాను. ఇది మాములు లవ్ స్టోరీ కాదు… పెదనాన్న ఫోటో చూశారు కదా.. చిన్నపాటి దేవుడిలా ఉన్నారు కదా.. గోపికృష్ణ సినిమా అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది.. పెదనాన్న మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి పెద్ద సినిమాలు చేశారు.. ఆ తరువాత బిల్లా తీశారు. అది బాగానే ఆడింది. ఇక ఇప్పుడు రాధేశ్యామ్.. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీనే కానీ .. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. పూజా ఈ సినిమాలో చాలా బాగా నటించింది.
డైరెక్టర్ రాధా గురించి చెప్పాలంటే.. 5 ఏళ్లు సినిమాలో కూర్చోడమంటే జోక్ కాదు.. సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలో సాహో వలన ఆగి , ఇంకొన్ని రోజులు కరోనా వలన ఆగి .. చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ట్రైలర్ లో కనిపిస్తోంది. క్లయిమాక్స్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సాహో సమయంలో ఇండియా అంతా తిరిగి సిగ్గుపోయి .. ఈ ఈవెంట్ లో బాగా మాట్లాడేస్తాను అనుకున్నాను.. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాన.. కానీ నా సిగ్గు పోలేదండి .. ఇక ఇది పోదేమో .. ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణం అభిమానులే లవ్ యూ సోమచ్ ” అని ముగించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







