నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..

- December 23, 2021 , by Maagulf
నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదారబాద్‌లో ఉన్న భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  • మొత్తం 20 ఖాళీలకు గాను ప్రాజెక్ట్ ఫీల్డ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌ (01), ప్రాజెక్ట్ టెక్నికల్‌ ఆఫీసర్ (01), ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ ఇన్వస్టిగేటర్‌ (04), ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ (03), ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ (05), ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌ (01), ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్‌ (05) పోస్టులు ఉన్నాయి.
  • పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్‌/ ఎండీ/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధితన పనిలో అనుభవం ఉండాలి.
  • అభ్యర్థులను వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

  • ఆసక్తిర అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తులను డైరెక్టర్‌, ఐసీఎంఆర్‌-నిన్‌, జామై ఉస్మానియా పోస్ట్‌, తార్నాక, హైదరాబాద్‌-500007 అడ్రస్‌కు పంపించాలి.
  • అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు, అనంతరం ఇంటర్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • దరఖాస్తుల స్వీకరణకు 10-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
  • పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్‌ చేయండి..

           https://www.nin.res.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com