జనవరి 2 నుండి కొత్త ట్రావెల్ నిబంధనలు
- December 24, 2021
కువైట్: జనవరి 2 నుండి కొత్త ట్రావెల్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 9 నెలల క్రితం రెండవ డోస్ తీసుకుంటే, వారు కచ్చితంగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందే. లేదంటే వారిని ప్రయాణించడానికి అనుమతించరు. ఈమేరకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. రెండో డోస్ తీసుకున్నవారు బూస్టర్ షాట్ తీసుకోకుంటే అలాంటి వారిని వ్యాక్సిన్ తీసుకోని వారిగా పరిగణిస్తారు. డిసెంబర్ 26 నుండి కువైట్ కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 48 గంటల ముందుగా చేయించుకున్న PCR టెస్ట్ నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాలని సర్క్యులర్ లో పేర్కొంది. అలాగే కువైట్ కు వచ్చిన వారు 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. ఒకవేళ 72 గంటల తర్వాత PCR టెస్ట్ లో నెగిటివ్ ఫలితం వస్తే వారు క్వారంటైన్ నుంచి బయటకు వచ్చేందుకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







