భారత్ కరోనా అప్డేట్
- December 26, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 6,987 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 76,766కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 162 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 7,091 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు మొత్తం 4,79,682 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 3,42,30,354 గా నమోదు అయింది. మరోవైపు భారత్లో ఇప్పటి వరకు మొత్తం 141.37 కోట్ల మందికి పైగా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







