కోవిడ్ నిబంధనలను పాటించని హోటళ్లకు నోటీసులు
- December 26, 2021
ఒమన్: కోవిడ్-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి ముందుజాగ్రత్త చర్యలను పాటించనందుకు హోటళ్లకు హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MHT) నోటీసులు జారీ చేసింది. భౌతిక దూరం నిబంధనను పాటించనందుకు మస్కట్ ఇంటర్కాంటినెంటల్ హోటల్, ట్రేడర్ విక్స్ రెస్టారెంట్ లకు నోటీసులు జారీ చేసినట్టు MHT తెలిపింది. ఇదే కారణంతో రమీ గెస్ట్ లైన్ హోటల్ కు కూడా నోటీసులు జారీ చేశారు. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోటల్స్, టూరిజం సంస్థలను MHT హెచ్చరించింది. రెస్టారెంట్లు, మీటింగ్ హాల్స్,బ్యాంకెట్ హాల్స్ లో విజిటర్స్ సంఖ్యను మొత్తం సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని అన్ని సంస్థలను ఆదేశించింది. విజిటర్స్, ఎంప్లాయిస్ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ఇతర నివారణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!