ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
- December 27, 2021
కువైట్: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై పోరుకు కువైట్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజా పరిణామాలను గమనిస్తున్నామని, ఒమిక్రాన్ తో పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ ఛైర్మన్, ప్రభుత్వ ప్రతినిధి తారెక్ అల్-మెజ్రేమ్ ఆదివారం తెలిపారు. ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా అధ్యక్షతన బయాన్ ప్యాలెస్‌లో కోవిడ్-19 పై చర్చించేందుకు మంత్రుల కమిటీ సమావేశమైంది. సమావేశం తర్వాత అల్-మెజ్రెమ్ మాట్లాడుతూ.. అర్హులైన వారు బూస్టర్ డోస్ పొందాలని, కరోనా నియంత్రణ మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







