తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఆటా వేడుకలు మరియు సేవా డేస్

- December 27, 2021 , by Maagulf
తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ఆటా వేడుకలు మరియు సేవా డేస్

హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో పద్మశ్రీ శోభరాజు, ఇండియన్ ముజిషియన్ కు జీవిత సాఫల్యం అవార్డును కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆటా సభ్యుల ఆధ్వర్యంలో అందించారు. 

అమెరికా తెలుగు సంఘం ప్రతి రెండు సంవత్సరాల కొకసారి నిర్వహించే ఆటా మహాసంబరాలు అమెరికాదేశంలో పెద్దఎత్తున ఆట సంస్థ జరుపుతుంది.మాతృ భూమి నుండి వివిధ రంగాలకు సంబందించిన ఎంతో మంది దిగ్గజాలను అతిథులుగా ఆహ్వానిస్తుంది.కన్న తల్లి సేవ గొప్పది.. మాతృ భూమికి ఎంతో సేవా చేసిన ఋణం తీర్చు కోలేము అంటూ అందుకుగాను, ఆటా మహా సంబరాలను జరిపే ముందే డిసెంబర్ మాసంలో గత ఇరవై సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలకు, పట్టణాలకు ఆటా సంస్థ కార్యవర్గం వచ్చి సేవా కార్యక్రమాలు స్థానికంగా నిర్వహిస్తారు.మంత్రులను, ఇక్కడి పాలకులను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలవడం,సంస్థ చేసే సేవా కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథులుగా స్వాగతించి, భాగస్వామ్యులను చేయడం సంస్థకు ఎంతో గర్వాన్ని, గౌరవాన్ని, సంతోషాన్ని కలుగచేస్తుంది.  

అందులో భాగంగా ఈ సారి మధు బొమ్మినేని ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా వేడుకలు మరియు ఆటా సేవ డేస్ చైర్ గా బాధ్యత తీసుకున్నారు.అధ్యక్షులు భువనేశ్ బూజల,ఆటా పాలకమండలి సభ్యులు, ఆటా వేడుకలు మరియు ఆటా సేవా డేస్ కో-చైర్స్ శరత్ వేముల,అనిల్ బొద్దిరెడ్డి, మరికొందరు పాలకమండలి సభ్యులు,కార్యవర్గ బృందం తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఎంతో బాధ్యతతో పనులు నిర్వహిస్తూ,పెద్దమొత్తంలో దాతలుగా పాటు తెలుగు రాష్ట్రాల్లో మరికొంత మంది దాతలతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలకు సహాయపడుతున్నారు.ముఖ్య అతిధులు,నిర్వాహకులు మరియు స్పాన్సర్లతో కలిసి 18 రోజుల్లో తెలగు రాష్ట్రాల్లో 17 నగరాల్లో 21 సేవా కార్యక్రమాలు నిర్వహించారు.సేవా కార్యక్రమంలో భాగంగా హేల్త్ క్యాంప్ లో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్,దంతం,నేత్రం,ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు.స్కూల్ ప్రోగ్రామ్ లో ఇన్ఫ్రాస్టక్చర్, ఫర్నిషింగ్, బుక్స్, క్రీడా వస్తువులు, స్కూల్ స్పోర్ట్స్ డ్రేస్,వాటర్ ఫిల్టర్ సిస్టమ్, డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేశారు.వచ్చే సంవత్సరం జులై 1, 2022 నుండి జులై 3, 2022 వరకు అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డిసి వాల్టర్ ఇ- కన్వేషన్ సెంటర్ లో అధ్యక్షులు భువనేశ్ బూజల సారథ్యములో పాలకమండలి మరియు కార్యవర్గ బృందం అంతా కలిసి నిర్వహించే 17వ ఆటా మహాసభలు మరియు యువ సమ్మేళనం జరిపే ముందు మాతృదేశములో ఆటా సేవ డేస్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ...అమెరికా వంటి దేశాలలో మన తెలుగు వారు చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు.అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదంటే అతిశయోక్తి లేదు.అమెరికాకు భారతీయురాలు ఉపాధ్యక్షురాలు కావడం అంటే మన దేశం ప్రజల ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది.మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాతృ దేశానికి సేవలు చేస్తున్నారు. ఆట సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం.ఎక్కడ ఎంత ఏం సంపాదించినా చివరకు మిగిలేది చేసే సేవా కార్యక్రమాలు మాత్రమే ప్రజలకు సేవ చేయాల్సిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి.ఆటా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం.అద్భుతమైన వ్యాక్సిన్ మనం కనుగొనగలము.పేద దేశాలకు వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.రానున్న రోజుల్లో సరికొత్త సాంకేతిక తో పాటు రాష్ట్రాలను దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఏ లక్ష్య సాధన కోసం తెలంగాణ సాధించుకుందాం అందు కోసం కృషి చేయాలి.

ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...ప్రపంచంలో పది మంది ఐటీ నిపుణులతో అందులో ఐదు  మంది భారతీయులే ఉంటారు. ఐదుగురు ఒక ఊరిలో ఒక తెలుగువారు.ఐటీ నిపుణులు అత్యధికులు తెలుగువారే ఉండడం గర్వకారణం...అమెరికా ఆర్థిక వ్యవస్థ లో మన తెలుగువారి పాత్ర విడదీయలేనిది...అమెరికా అభివృద్ధిలో మన పాత్ర అత్యంత కీలకమైనది.అమెరికా వంటి దేశంలో రాజకీయాలలో కూడా తెలుగు వారి ప్రాముఖ్యతను పెంచాలి.అమెరికాలో మన తెలుగు విద్యార్థులకు ఆటా చేస్తున్న సేవలు అభినందనీయం.

తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ...హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆటా వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కూడా అవసరం...తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్తులో అభివృద్ధి సాధించాం...అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com