డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మీ ఇంట్లో చెపుతారు..మీ బాస్ కూ చెపుతారు
- December 28, 2021
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. మందుబాబులు మద్యం తాగి రోడ్డుపై వాహనాలను నడపకుండా కట్టడి చేసేందుకు పలు రకాల పధ్దతుల్లో జరిమానాలు, శిక్షలు విధిస్తున్నారు. కొంత మందికి జైలు శిక్షలు కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి.
ఇటీవల మద్యం తాగి వాహనం నడిపిన వారి కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్ కు పిలిపించి వారి ముందు మందు బాబులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు ఇప్పుడు కొత్త పధ్ధతి మొదలెట్టారు. రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరు మందు బాబుల ఘనకార్యం గురించి వాళ్లు పని చేస్తున్న ఆఫీసుకు లేఖలు రాశారు.
భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై ఉద్యోగులకు అవగాహాన కల్పించాలని లేఖలో సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయామని తోటి ఉద్యోగుల్లో చులకన భావం వస్తే…అప్పటికైనా మారి మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో గత వారం రోజులు పరిధిలో 100 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 15 మంది మరణించారు.88 మందిగాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







