మార్చ్ 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సంధర్భముగా మెగా బ్లడ్‌ క్యాంప్‌

- March 25, 2016 , by Maagulf
మార్చ్ 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సంధర్భముగా మెగా బ్లడ్‌ క్యాంప్‌

చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తేజ్‌ పుట్టిన రోజుసందర్భంగా మార్చి 27వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని భారీ స్థాయిలో నిర్వహించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవి చారిటబుల్‌ట్రస్టు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభిమానులను కోరుతున్నారు. హైదరాబాద్‌లోని ట్రస్టు కార్యాలయంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అదేరోజు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో రక్తదానం చేయాలని అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు. ఏకకాలంలో వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com