బహ్రెయిన్ లో అమల్లోకి వచ్చిన 10% వ్యాట్
- January 02, 2022
బహ్రెయిన్: బడ్జెట్ లోటును అదుపులో పెట్టేందుకు పెంచిన వ్యాట్ అమల్లోకి వచ్చింది. చట్టం ప్రకారం పన్ను విధించబడే అన్ని వస్తువులపై పెరిగిన 10% విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చెల్లుబాటు అవుతుంది. బడ్జెట్ లోటును అరికట్టడానికి, కోవిడ్ 19 ద్వారా ప్రభావితమైన ఫిస్కల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌ను తిరిగి స్థిరీకరించడానికి బహ్రెయిన్ పన్ను రేటును పెంచింది. రెండు సంవత్సరాల తర్వాత వ్యాట్ రేట్లలో సవరణలు జరిగాయి. ప్రాథమిక ఆహారం, కొత్త భవనాల నిర్మాణం, చమురు, గ్యాస్, ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర వాటికి VAT నుండి మినహాయింపు ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ తో పాటు కొన్ని ఆర్థిక సేవలు వ్యాట్ పెంపుతో ప్రభావితం కావు. జనవరి 1, 2022లోపు సరఫరా చేయబడిన ప్రామాణిక-రేటెడ్ వస్తువులు, సేవలకు 5%(పాత రేటు) VAT రేటు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







