గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు

- March 25, 2016 , by Maagulf
గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు

జిల్లా అంతటా క్రైస్తవ సోదరులు శుక్రవారం భక్తిశద్ధ్రలతో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌తోపాటు హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట, మంథని, గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, సిరిసిల్ల తదితర పట్టణాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో చర్చి ప్రాంగణాలు క్రైస్తవులతో కిటకిటలాడాయి. గుడ్‌ఫైడే సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కెథడ్రిల్ వెస్లీ, సెయింట్ మార్చ్, సెంటినరీ వెస్లీ, లూర్థుమాత చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.భక్తిగీతాలను ఆలపించారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని విద్యుద్దీపాలతో చర్చిలు దగాదగా మెరిసాయి. మొత్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకోగా, చర్చిల ప్రాంగణాలు ప్రత్యేక ప్రార్థనలతో మారుమ్రోగాయి.ప్రచార ఆర్బాటాలతో మభ్య పెడుతున్నారు
* అభివృద్ధిని ఓర్వలేకనే బిజెపిపై కాంగ్రెస్ ఆరోపణలు * కేంద్ర పభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు అర్హనీయం * బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్‌కుమార్పెద్దపల్లి, మార్చి 25: రెండెళ్ల పాలనలో టి ఆర్ ఎస్ ప్రచార ఆర్బాటాలతో ప్రజలను మభ్యపెడుతుంది తప్పా సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమైందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్‌కుమార్ అన్నారు. పెద్దపల్లి అతిథి గృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు శాతం డీఏ పెంపు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం 2015లో అమలు చేసిన డీఏను ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించడంలేదని ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో జరుగుతున్న అభివృద్దిని ఓర్వలేకనే కాంగ్రెస్‌పార్టీ నాయకులు బురుదజల్లే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్వచ్ఛ్భారత్ మరుగుదోడ్ల నిర్మాణంతో నిరుపేదల బహీర్భూమిని రూపుమాపేందుకే 10వేల కోట్ల నిధులను కేటాయించిందని అన్నారు. రాబోయే కాలంలో రైతులకు తక్కువ ధరలకు ఎరువులను అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కార్పోరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేసి పేదలపై పెనుభారాన్ని మోపారని, అధిక నియంత్రణలో కేసి ఆర్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఫీజుల నియంత్రణ కోసం మూడు జీవోలు 1,42,91లను తీసి అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపిలకు విద్యాసంస్థలు ఉన్నందుకే అధిక ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేక పోతుందన్నారు. నిరుపేదల ఉన్నత చదువులకు అధిక ఫీజులతో దూరకాక తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు నీరును కరీంనగర్, పెద్దపల్లి తదితర డివిజన్ ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, బెజ్జెంకి దిలిప్‌కుమార్, దాడి సతీష్, శీలారపు పర్వతాలు, రాజమహంతకృష్ణ, వోల్ల తిరుపతి, జక్కుల శ్రీకాంత్, రాజన్న పటేల్ తదితరులు పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com