శ్రీశాంత్ శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు..
- March 25, 2016
కెరీర్ ప్రారంభంలోనే అద్భుత ప్రతిభకనబర్చి 'కేరళ స్పీడ్ స్టర్'గా ఖ్యాతిపొంది, అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటకు దూరమైన క్రికెటర్ శ్రీశాంత్ జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. రాజకీయ అరంగేట్రంపై కొద్దిరోజులుగా వినిపిస్తోన్న ఊహగానాలకు తెరదించుతూ శ్రీశాంత్ శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. కేరళ బీజేపీ చీఫ్ కుమ్మనన్ రాజశేఖరన్, ఇంకొందరు ముఖ్యనేతల కమలం కండువవా కప్పి శ్రీశాంత్ ను పార్టీలోకి ఆహ్వానించారు.వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తోన్న బీజేపీ తొలి విడతగా 51 మంది అభ్యర్థుల జాబితాను విడుదలచేసింది.కీలకమైన తిరువనంతపురం స్థానం నుంచి శ్రీశాంత్ బరిలోకి దిగుతున్నాడు. సిటీలో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండటంతోపాటు యువతరం ఓట్లను కొల్లగొట్టగలడనే నమ్మకంతోనే శ్రీశాంత్ కు తిరువనంతపురం టికెట్ ఇచ్చినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







