ఇంకా ఐసీయూ లోనే లతా మంగేష్కర్..హెల్త్ బులిటెన్ రిలీజ్!
- January 12, 2022
ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. నిన్న కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో గాయని లతా మంగేష్కర్ ను ముంబై లోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కు ఆమె కుటుంబ సభ్యులు తరలించారు.
ప్రస్తుతం గాయని లతా మంగేష్కర్ ను ఐసీయూలో ఉంచారు. అయితే… తాజాగా గాయని లతా మంగేష్కర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు.
"గాయకురాలు లతా మంగేష్కర్ ICU వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె మరో 10-12 రోజుల పాటు ఐసీయూలోనే ఉంటారు. ఆమె కోవిడ్‌తో పాటు, న్యుమోనియాతో కూడా బాధపడుతున్నారు. ఆమెకు మంచి వైద్యం అందిస్తున్నాం" అని బ్రీచ్ కాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సంధాని చెప్పారు. ఇక అటు గాయని లతా మంగేష్కర్ మేనకోడలు రచన.. కూడా ఆమె ఆరోగ్యం పై స్పందించారు. "లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. ఎవరు కూడా కంగారు పడొద్దు. ఆమె వయస్సు పెద్దది కనుక.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే… ఐసీయూలో ఉంచారు" అంటూ వెల్లడించింది రచన.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







