యూఏఈ: వేతనాలు చెల్లించకపోతే 50,000 దిర్హాముల జరిమానా, ఆలస్యానికి పెనాల్టీ
- January 12, 2022
యూఏఈ: కార్మిక సంక్షేమానికి యూఏఈ ప్రభుత్వం అమితమైన ప్రాధాన్యతనిస్తోంది. దేశ నాయకత్వం, పలు డిక్రీలను కార్మికుల హక్కులను కాపాడేందుకు జారీ చేయడం జరుగుతోంది. కార్మికుల హక్కులు, రిక్రూట్మెంట్, వేతనాల చెల్లింపులు, హౌసింగ్ అలాగే ఆరోగ్యం వంటి అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది దేశ నాయకత్వం. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్ తాజాగా ప్రైవేటు సంస్థలు తమ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించింది. వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ (డబ్ల్యుపిఎస్) ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాల్సి వుంటుంది. ఈ విధానం ద్వారా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ఆథరైజ్ చేసిన బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ నుంచి కార్మికులకు వేతనాలు పంపాల్సి వుంటుంది.
జరిమానాలు, పెనాల్టీలు
యూఏఈ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించని కంపెనీలకు పెనాల్టీలు వేయడం జరుగుతుంది. డ్యూ డేట్ దాటి 10 రోజుల లోపు వేతనాలు చెల్లించకపోతే, దాన్ని ‘ఆలస్యం’గా పరిగణిస్తారు.
డబ్ల్యుపిఎస్ ద్వారా తప్పుడు సమాచారాన్ని నింపితే ఒక్కో కార్మికుడికి 5,000 దిర్హాముల చొప్పున అత్యధికంగా 50,000 దిర్హాముల వరకు జరీమానా విధిస్తారు. డ్యూ డేట్ లోపు డబ్ల్యుపిఎస్ ద్వారా చెల్లింపు చేయకపోతే 1,000 దిర్హాములు (ఒక్కో ఉద్యోగికి) చెల్లించాలి. ఫేక్ పే స్లిప్స్ మీద బలవంతంగా కార్మికులతో సంతకాలు చేయిస్తే, ఒక్కో ఉద్యోగికి 5,000 దిర్హాముల జరిమానా విధిస్తారు.
సేలరీలు ఆలస్యమైతే (100కి మించి కార్మికులున్న సంస్థలకు)
60 రోజులకు పైగా వేతనాల చెల్లింపు ఆలస్యమైతే, ఒ్కో కార్మికుడికి 5,000 దిర్హాములు, అత్యధికంగా 50,000 దిర్హాములు జరిమానా. ఆలస్యం జరిగిన నాటి నుండి 16 రోజుల తర్వాత ఆయా సంస్థలు వర్క్ పర్మిట్లను జారీ చేయడానికి వీల్లేదు. నెల రోజులపాటు వేతనాలు ఆలస్యం చేస్తే, అలాంటి సంస్థల్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించడం జరుగుతుంది. ఆ సంస్థ యజమానికి చెందిన ఇతర సంస్థలపైనా చర్యలు తీసుకుంటారు. కొత్తగా ఆ ఓనర్ ఎలాంటి కంపెనీ పెట్టడానికి వీల్లేదు. ఎంప్లాయర్ బ్యాంక్ గ్యారంటీని లిక్విడేటెడ్ చేస్తారు. మూడో కేటగిరీకి ఆ కంపెనీని డౌన్ గ్రేడ్ చేసేస్తారు. కార్మికులు వేరే కంపెనీలోకి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఒకసారి కంటే ఎక్కువసార్లు ఉల్లంఘనకు పాల్పడితే, ఎంఓహెచ్ఆర్ఈ పెనాల్టీలను విధిస్తుంది. వర్క్ పర్మిట్లను బ్యాన్ చేస్తుంది, జరిమానాల్నీ విధిస్తుంది. కోర్టుకి ఆ కంపెనీని రిఫర్ చేస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







